రాసూరి శంకర్ రోడ్డు ప్రమాదంలో మృతి –BRS పార్టీకి తీరని లోటు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఉద్యమకారుడు, లేబర్ కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్షుడు, టీఎన్‌ఎస్‌ఎస్‌యు (TBGKS) సెంట్రల్ కమిటీ సభ్యుడు రాసూరి శంకర్ ఈ రోజు రుద్రంపూర్ వద్ద జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ సంఘటన పట్ల భారీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి, కార్మిక ఉద్యమానికి తీరని లోటుగా భావిస్తున్నమని మాజీ తాజా కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు.
రాసూరి శంకర్ అనేక సంవత్సరాలుగా కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ, ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ, వారి సమస్యలకు పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఆయన నాయకత్వంలో లేబర్ కాంట్రాక్ట్ యూనియన్ అనేక విజయాలను సాధించింది.
ఈ విషాద సమయంలో, మాజీ తాజా కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి స్పందిస్తూ, “రాసూరి శంకర్ మరణించడం చాలా బాధాకరం. పార్టీకి ఇది తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటాం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని ప్రకటిస్తున్నాను” అని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పెద్ద ఎత్తున ఈ వార్తపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రాసూరి శంకర్ గారి సేవలు చిరస్మరణీయమవుతాయని పేర్కొంటున్నారు.
Post a Comment