భద్రాద్రి జిల్లా DMW CPO సంజీవ్ రావుపై మైనారిటీల వివక్షపై ఆవేదన
భద్రాద్రి జిల్లా DMW CPO సంజీవ్ రావుపై మైనారిటీల వివక్షపై ఆవేదన వ్యక్తం చేసిన కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండి. గౌస్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిపార్ట్‌మెంట్ ఆఫ్ మైనారిటీ వెల్ఫేర్ (DMW) లో పనిచేస్తున్న చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (CPO) సంజీవ్ రావు మైనారిటీ నాయకుల పట్ల వివక్షతతో వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండి. గౌస్ పాషా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
గౌస్ పాషా మాట్లాడుతూ, "రాజీవ్ యువ వికాసం పథకంపై అవగాహన సదస్సు ఆన్లైన్ ప్రక్రియ గడువు ముగిసే సమయంలో నిర్వహించడం సమంజసమా? ఈ అంశాన్ని ప్రశ్నించగానే మమ్మల్ని అవగాహన సదస్సుకు ఆహ్వానించకపోవడం మాకు అవమానంగా భావించాము. ఇది మైనారిటీల పట్ల ఉద్దేశ్యపూర్వకంగా చూపుతున్న చిన్నచూపుకి నిదర్శనం" అన్నారు.
ఇలాగే కొనసాగితే, జిల్లా కలెక్టర్ తో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి వస్తుందనీ, ఈ వివక్షతను తక్షణం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో మైనారిటీలను కలుపుకోవాల్సిన బాధ్యత ఉన్న అధికారులే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే అది ఆందోళనకరం అని గౌస్ పాషా స్పష్టం చేశారు.
ఈ విషయంపై అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని, మైనారిటీ హక్కులను కాపాడే దిశగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.
Post a Comment