అర్జెంటీనా ISSF వరల్డ్ కప్‌లో ఈషా సింగ్ రజత పతకం విజయం
అర్జెంటీనా ISSF వరల్డ్ కప్‌లో ఈషా సింగ్ రజత పతకం విజయం – సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) వరల్డ్ కప్ 2025లో భారత షూటర్, హైదరాబాద్‌కు చెందిన ఈషా సింగ్ అద్భుత ప్రదర్శనతో 25 మీటర్ల మహిళల పిస్టల్ విభాగంలో రజత పతకం గెలుచుకొని దేశానికి, రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈషా సింగ్‌ను హృదయపూర్వకంగా అభినందించారు. మహిళల షూటింగ్ ఈవెంట్‌లో ఆమె ప్రతిభను ప్రదర్శించి రజత పతకం సాధించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. క్రీడారంగంలో మహిళలు ఈ విధంగా సత్తా చాటడం అభినందనీయమని ప్రశంసించారు.
ఈషా సింగ్ అటు జాతీయస్థాయిలో, ఇటు అంతర్జాతీయ స్థాయిలో పలు విజయాలతో ఎదుగుతూ, యువతకు ప్రేరణగా నిలుస్తుండడం గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకాలు సాధించాలని, రాష్ట్రానికి మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరఫున అన్ని విధాలుగా ఈషా సింగ్‌కు ప్రోత్సాహం అందిస్తామని, యువ క్రీడాకారులకు అవసరమైన మద్దతు కొనసాగుతుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
Post a Comment