-->

KTPS 6వ దశ నిర్మాణ కార్మికులను 'ఆర్టీజన్' లుగా నియమించాలి

KTPS 6వ దశ నిర్మాణ కార్మికులను 'ఆర్టీజన్' లుగా నియమించాలి


KTPS 6వ దశ నిర్మాణ కార్మికులను 'ఆర్టీజన్' లుగా నియమించాలంటూ BRS పార్టీ డిమాండ్, నిర్మాణ కార్మికుల దీక్షకు వనమా రాఘవ, కిలారు నాగేశ్వరరావు సంఘీభావం

పాల్వంచ: గత 11 రోజులుగా నిరాహార దీక్ష నిర్వహిస్తున్న KTPS 6వ దశ నిర్మాణ కార్మికులను వెంటనే ఆర్టీజన్ పోస్టుల్లో నియమించాలంటూ BRS పార్టీ తీవ్రంగా డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా BRS యువజన నేత వనమా రాఘవ, పార్టీ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు శనివారం దీక్షా శిబిరాన్ని సందర్శించి, కార్మికులకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వనమా రాఘవ మాట్లాడుతూ, "KTPS సంస్థతో మా వంశానికి అనుబంధం ఎంతో దాదాపు ఐదు దశాబ్దాలుగా ఉంది. కార్మికుల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టాం. 2012-13లో KTPS 6వ దశ ఎదుట నాలుగు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. ఆ సమయంలో అన్ని యూనియన్లు నా దీక్షకు మద్దతుగా నిలిచిన ఘటనను నేను ఎప్పటికీ మర్చిపోను," అని గుర్తు చేశారు.

KTPS 6వ దశ, 7వ దశ నిర్మాణానికి తమ కుటుంబం ఎంతో కృషి చేసినట్లు ఆయన తెలిపారు. "ఈరోజు హైదరాబాదులో పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిసి కార్మికుల సమస్యలు వివరించనున్నాను. వారి తరఫున తగిన చర్యలు తీసుకునేలా చూస్తా," అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు:

  • BRS సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు
  • పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్
  • పాల్వంచ పట్టణ అధ్యక్షులు పూసల విశ్వనాథం, డిష్ నాయుడు, మల్లెల రవి చందర్
  • దాసరి నాగేశ్వరరావు, కాల్వ ప్రకాష్, భూక్య చందు నాయక్, సమ్మయ్య గౌడ్
  • BRSV పట్టణ అధ్యక్షులు దుర్గాప్రసాద్, జనరల్ సెక్రటరీ కంచర్ల రామారావు
  • బేతంచెట్టి విజయ్, తెలంగాణ కేటీపీఎస్ సురేష్, MPTC గురవయ్య, పునుగుల ఉదయ్
  • కుంపటి శివ, వెంకట్ నారాయణ, కాపు సంఘం ప్రెసిడెంట్ రంగయ్య, పత్తిపాటి శ్రీను
  • బొల్లేరిగూడెం కోదండరావు, డాక్టర్ మధు, తెలంగాణ నగర్ గిరి, జక్కుల వెంకటేశ్వర్లు
  • తెలంగాణ రవి, మహిళా అధ్యక్షురాలు బట్టు మంజుల, నవభారత్ ఆనంద్
  • కార్మికుల ఆర్గనైజర్లు వాంగులోత్ హరి రామ్, బి మురళీకృష్ణ, భూక్య లక్ష్మణ్ నాయక్, ఏ చంటి, బద్రు, జమున, కేటీపీఎస్ సత్యవతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

BRS పార్టీ నిర్మాణ కార్మికుల పక్షాన నిలవడం, వారి హక్కుల కోసం పోరాటం చేయడం పై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Blogger ఆధారితం.